RBI: నూత‌న ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్థానం ఇదీ...! 12 d ago

featured-image

ఆర్‌బీఐ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా సంజ‌య్ మ‌ల్హోత్రాను కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సంజయ్ మల్హోత్రా బుధవారం ఆర్ బీఐ 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయన ఈ పదవిలో మూడేళ్లు పాటు కొనసాగనున్నారు.

ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత డిసెంబర్ 12, 2018న శక్తికాంతదాస్(67) RBI 25వ గవర్నర్ గా నియమితులయ్యారు. 2018లో తొలిసారిగా దాస్ బాధ్యతలు స్వీకరించారు. 2021లో కేంద్రం ఆయన పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించింది. తన పదవీ కాలంలో కోవిడ్ కారణంగా దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం సమస్యను నియంత్రించడంలో ఆయన విశేషమైన కృషి చేశారు. అటువంటి పరిస్థితిలో అతని పదవీకాలం పొడిగింపు గురించి ఎటువంటి చర్చ జరగలేదు. రెండోవిడత పదవీకాలం డిసెంబ‌రు 10వ తేదీ మంగళవారంతో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా (56) కేంద్రం నియమించింది.

సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ కు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్సు లో ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో పట్టాను పొందారు. 33 ఏళ్ళ వృత్తి జీవితం లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, ఐటీ, గనుల రంగాల్లో ఆయ‌న‌ పని చేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక‌ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా పనిచేస్తున్నారు. రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వ స్థాయిల్లో ఫైనాన్స్, టాక్సేషన్ లో అపార‌ అనుభం కలిగి ఉన్నారు. పన్నులకు సంబంధించి పన్ను విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD